15, ఆగస్టు 2010, ఆదివారం

స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

చిన్నప్పుడు మనమంతా పాడుకున్న ఈ పాట అంతర్జాలంలో ఎక్కడ వెతికినా దొరకలేదు. బ్లాగ్మిత్రులందరికీ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

కాకమ్మా చిలకమ్మా కథలే మాకొద్దు
మా గాంధి చెప్పిందే మాకెంతో ముద్దు

నెహ్రూజీ ఏమన్నారు?
శాంతి శాంతి అన్నారు
నేతాజీ ఏమన్నారు?
జైహింద్ జైహింద్ అన్నారు
లాల్ బహుద్దుర్ వీర బహుద్దుర్ ఏమని అన్నారు?
జై జవాన్ జై కిసాన్ అన్నారు, పదమన్నారు

లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలల్లలా

పిల్లలకే ఇక రాజ్యం ఇస్తే
ఎల్లలు కల్లలు చెరిపేస్తాం
అల్లరి మూకల ఆటలు కట్టి
తెల్లని పావురమెగరేస్తాం
సింహానికీ జింక పిల్లకు
స్నేహం కలిపి మెప్పిస్తాం

లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలల్లలా

3 కామెంట్‌లు:

  1. మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. అక్షర మోహనం గారు,
    ఏమోనండి, చిన్నప్పుడు అమ్మ నేర్పిన పాట. ఎవరు రాసారో అంతర్జాలంలో ఎంత వెతికినా దొరకలేదు.

    జయ గారు,
    ధన్యవాదాలు,మీకు కూడా శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి